విజయసాయిరెడ్డి గారూ.. అందుకే మీకు 16 నెలలు శ్రీకృష్ణ జన్మస్థానప్రాప్తి అయింది!: బుద్ధా వెంకన్న సెటైర్లు

  • దొంగలెక్కలు రాయడంలో మీరు సిద్ధహస్తులు
  • కిన్లే వాటర్ బాటిళ్లతో ప్రజల దృష్టిని మళ్లించారు
  • దొడ్డిదారిన జీవోలతో ప్రజాధనాన్ని దోచుకున్నారు
దొంగలెక్కలు రాయడంలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి సిద్ధహస్తుడని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. అందుకే ఆయన 16 నెలలు జైలుకు వెళ్లారని ఎద్దేవా చేశారు. కిన్లే వాటర్ బాటిళ్లు మాత్రమే వాడుతున్నాం అని ప్రజల దృష్టిని మళ్లించిన జగన్ ప్రభుత్వం దొడ్డిదారిన జీవోలతో ప్రజా ధనాన్ని దోచుకుందని విమర్శించారు. ఇదే వైసీపీ ప్రభుత్వం ప్రత్యేకత అని చురకలు అంటించారు.

ఈరోజు ట్విట్టర్ లో బుద్ధా వెంకన్న స్పందిస్తూ..‘అవకాశం దొరకాలే కానీ మీరు ఎక్కడైనా దొంగలెక్కలు రాయగల సిద్ధహస్తులు విజయసాయిరెడ్డి గారు. అందుకే కదా 16 నెలల కృష్ణాజన్మస్థాన ప్రాప్తి అయ్యింది. ప్రజలను కిన్లే వాటర్ బాటిల్ తో ఏమార్చి, దొడ్డిదారిన జీవోలతో ప్రజాధనాన్ని బొక్కడమే కదా మీ ప్రత్యేకత’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు ఓ ఫొటోను ఆయన జతచేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Telugudesam
budha venkannaka
Twitter

More Telugu News